Politics
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన: 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లు, 22ఏ భూములపై కీలక నిర్ణయం!
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా కీలక అడుగులు వేశారు. గురువారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కోర్ అర్బన్ (CURE) ప్రాంత పరిధిలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్)’ నిర్మాణానికి ఆయన లాంఛనంగా శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పేదలను ఏ విధంగా మోసం చేసిందో ఈ […]
హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..!
హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడటానికి, చెరువులను ఆక్రమణదారుల నుంచి విముక్తి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన తొలి రోజుల్లోనే అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ సంచలనం సృష్టించిన ఈ సంస్థ, ప్రస్తుతం ఒక కీలకమైన న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. సల్కం చెరువు పరిధిలోని ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంతో తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు నోటీసులు […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం!
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేసులో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసేందుకు సిట్ సిద్దమైన పరిస్థితుల్లో ఓ విశ్రాంత డీజీపీ (DGP)తో పాటు మరో డీజీ (DG) ని సాక్షులుగా చేర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో విచారణ సమయంలో వారి వాంగ్మూలాలే కేసును మలుపు తిప్పే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారిలో ఒకరు సుదీర్ఘకాలం పోలీస్‌శాఖలో డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందగా, మరొకరు […]
NRI వార్తలు
చూపునిచ్చే సంకల్పం: డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ ‘5K వాక్’ దిగ్విజయం
చూపునిచ్చే సంకల్పం: డెట్రాయిట్‌లో శంకర నేత్రాలయ ‘5K వాక్’ దిగ్విజయం అమెరికాలో ఘనంగా వార్షిక నడక.. వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవాస భారతీయుల కదనోత్సాహం డెట్రాయిట్/మిచిగన్ (ప్రత్యేక ప్రతినిధి): కంటిచూపు సమస్యలతో అంధకారంలో మగ్గుతున్న పేద, బడుగు వర్గాల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు శంకర నేత్రాలయ చేపడుతున్న సేవా యజ్ఞానికి అమెరికాలోని ప్రవాస భారతీయులు ఘన నీరాజనం పలికారు. మిచిగన్‌లోని శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక ‘5K వాక్’ […]
సింగపూర్‌లో ‘జయ’హో తెలుగుదనం
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రపంచవ్యాప్త సమష్టి కృషి అవసరం: జయ పీసపాటి సింగపూర్‌లో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలికి ఘన సత్కారం సింగపూర్ (ప్రత్యేక ప్రతినిధి): తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు సజీవంగా అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా సమష్టిగా కృషి చేయాలని హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనకు విచ్చేసిన ఆమె గౌరవార్థం ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘శ్రీ సాంస్కృతిక […]
తెలుగు ప్రముఖులు
కాకినాడ నుంచి అమెరికా దాకా… అక్షర హాస్య ప్రస్థానం!
కాకినాడ నుంచి అమెరికా దాకా… అక్షర హాస్య ప్రస్థానం! వీడియో ఆత్మకథ రూపంలో అమెరికా హాస్యబ్రహ్మ ‘వంగూరి చిట్టెన్ రాజు’ జీవిత విశేషాలు; కాకినాడ నుంచి ఐఐటీకి, అక్కడి నుంచి అమెరికాకు సాగిన ఆసక్తికర ప్రయాణం! పుస్తక రూపంలో ఆత్మకథలు రాసుకోవడం పరిపాటే. కానీ, దశాబ్దాల తన జీవితానుభవాలను, అమెరికాలో తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని భావితరాలకు అందించేందుకు ప్రముఖ రచయిత, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు వినూత్నంగా ‘వీడియో […]
సాహిత్యం
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక – కాళోజీ : మంత్రి జూపల్లి
రవీంద్రభారతిలో ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు ఆర్. విద్యార్థికి కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం సామాన్యుడి గొంతుకగా నిలిచిన మహాకవి ఆశయాలకు రవీంద్రభారతి వేదికగా ఘన నీరాజనం. తెలంగాణ భాషకు యాసకు పట్టంకట్టిన ప్రజాకవి స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజపు కుళ్లును ప్రశ్నిస్తున్న అరుదైన సైనిక కవి డాక్టర్ వి ఆర్ విద్యార్థి (వేలూరి రాములు)కి 2026 రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం. అక్షరాన్ని ఆయుధంగా మలిచి సమాజాన్ని మేల్కొల్పిన అద్భుతమైన అక్షర పండుగ. భాష కేవలం సంభాషణకు […]
అక్షర తపస్విని కుమారి లక్ష్మీ అహల: ముంబాయి తెలుగు సమితి వేదికపై అష్టావధాన వైభవం
అక్షరాల ఆకాశంలో అహల ఉదయతార చదువుకునే వయసులోనే అక్షరాలతో సాహిత్య సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది కుమారి లక్ష్మీ అహల. ముంబాయి తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాల సదస్సులో తన 9వ అష్టావధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి, పృచ్ఛకుల సవాళ్లకు పద్యంతో సమాధానమిస్తూ తన అసాధారణ ధారణా ప్రతిభను చాటింది. పదేళ్ల ప్రాయంలోనే ఛందస్సును ఒడిసిపట్టి, పద్యాన్ని పలికించి, తెలుగు సాహిత్యాన్ని తన శ్వాసగా చేసుకున్న అహల ప్రతిభ నిజంగా అభినందనీయం. ఇది ఒక బాలిక సాధించిన విజయం […]
Business
ఈ20తో వాహన ఇంజిన్లకు భారీ ముప్పు.. సియామ్ ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ20 (E20 Petrol) ఇంధనాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ20 పెట్రోల్ నాణ్యతపై భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఇంధనంలో క్లోరైడ్ కాలుష్యం, తేమ శాతం విపరీతంగా ఉండటం వల్ల వాహనాల ఇంజిన్లలోని కీలక విడిభాగాలు వేగంగా దెబ్బతింటున్నాయని ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్’ (సియామ్) కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు రాసిన […]
త్వరలోనే 5.1 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ: నిర్మలా సీతారామన్
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదిక అంచనాల ప్రకారం, 2028-29 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy) 5.1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 425 లక్షల కోట్లు) అద్భుతమైన మైలురాయిని విజయవంతంగా దాటుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ వేదికగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక అనిశ్చితుల మధ్య కూడా భారత దేశం అత్యంత స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తూ, ఈ భారీ లక్ష్య […]
Technology
సైబర్ మోసాలకు చెక్: డిజిటల్ చెల్లింపులపై బ్యాంకుల కీలక ప్రతిపాదనలు
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో, అదే స్థాయిలో సైబర్ మోసాలు, నకిలీ కాల్స్, డీప్‌ఫేక్ ఐడెంటిటీలు, బెదిరింపులతో జరుగుతున్న ఆర్థిక నేరాలు (Cyber Crimes) కూడా విపరీతంగా ఎక్కువవుతున్నాయి. అమాయకులైన బ్యాంక్ కస్టమర్లు క్షణాల్లో లక్షలాది రూపాయలు కోల్పోతున్న ఘటనలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయి. పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను అరికట్టడానికి, వినియోగదారుల ఆర్థిక భద్రతను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల ఒక ముసాయిదా చర్చా పత్రాన్ని విడుదల చేసింది. […]
సినిమా
జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా భుజం శస్త్రచికిత్స
2, 3 నెలల పాటు విశ్రాంతి! ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు బుధవారం హైదరాబాద్‌లో భుజం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఇటీవల ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయన భుజానికి తీవ్ర గాయం కావడంతో, సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో ఈ ఆర్థ్రోస్కోపిక్ (Arthroscopic) సర్జరీని నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆపరేషన్ విజయవంతమైందని ఆసుపత్రి వర్గాలు ఒక హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి. గత వారం షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయపడినప్పుడు, ముందుగా […]
Advertisement
-
నాగభూషణం పరిక commented on సముద్రాలు దాటిన తెలుగు సిరి: శ్రీమతి రాధికా మంగిపుడి గారు తెలుగింటి సాహిత్య శిర
-
K S S BAPUJEE commented on సముద్రాలు దాటిన తెలుగు సిరి: Wonderful article on Smt. Radhika garu. Her tremen
-
Bapujee Kanuru commented on సముద్రాలు దాటిన తెలుగు సిరి: Wonderful article on Smt. Radhika garu. Her tremen
