వ్యాసుని వ్యధ:భాగవత రచన
ద్వాపరయుగం చివరిదశలో కృష్ణద్వైపాయనుడు ఈ భరతభూమిపై అవతరించాడు. ఆయన తల్లి సత్యవతి. తండ్రి పరాశరమునీంద్రుడు. శ్రీమహావిష్ణువు అంశతో జన్మించిన కారణంగా కృష్ణద్వైపాయనుడు పుట్టుకతోనే యోగి అయినాడు. తపస్సు చేసి దైవానుగ్రహం సాధించి, సకల వేదశాస్త్రాలనూ అభ్యసించాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. త్రికాలవేత్తగా ప్రఖ్యాతి చెందాడు.ఒకనాడు వేకువనే స్నానానికై కృష్ణద్వైపాయనుడు సరస్వతినదీ తీరానికి చేరుకున్నాడు. స్నానం చేసి, ఏకాంత స్థలంలో కూర్చున్నాడు. ధ్యానం చేయసాగాడు. ఆ ధ్యానంలో జరగబోయేదంతా ఆయనకు తెలియ వచ్చింది. త్వరలోనే కలియుగం రానున్నది. ఆ యుగంలో…